ఓటు హక్కు.. మూడేళ్లకు కుదించారు
భారత దేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన మొదట్లో రాజ్యాంగం ప్రకారం 21 ఏళ్లు గల వారికే ఓటు హక్కు ఉండేది. 61 వ రాజ్యాంగ సవరణ ద్వారా 1983లో ఓటు హక్కు అర్హత వయసును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. అప్పటి నుండి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటర్లుగా నమోదు చేసుకుని ఓటు వేయడం ప్రారంభమైంది. మరోవైపు, వివిధ పార్టీల తరపున ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులెవరూ ఓటర్లకు నచ్చకపోతే.. వారిని తిరస్కరించేలా నోటాను 2013 సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. నోటా ఐచ్ఛికాన్ని తొలుత ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా 2013 నుంచి అమలు చేయండం జరిగింది.

