జేపీసీ సమావేశంలో బాటిల్ పగలగొట్టిన ఎంపీ
జేపీసీ వక్ఫ్ సవరణ బిల్లు సమావేశం వాడివేడిగా కొనసాగింది. సమావేశం జరుగుతుండగా.. నేతల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ గ్లాస్ బాటిల్ ను తీసుకొని టేబుల్ పై కొట్టారు. దీంతో ఆయన చేతికి తీవ్రగాయమైంది. వైద్యులు నాలుగు కుట్లు వేశారు. సమావేశాన్ని మధ్యంతరంగా నిలిపివేశారు. బీజేపీ నేత అభిజిత్ గంగోపాధ్యాయతో వాగ్వాదం సందర్భంగా బెనర్జీ బాటిల్ ను పగలగొట్టినట్లు తెలుస్తోంది. కమిటీ అధికార, ప్రతిపక్ష నేతల అభిప్రాయాలను తెలుసుకుంటున్న సమయంలో బీజేపీ తీవ్ర అభ్యంతర పదజాలం వాడిందని ప్రతిపక్షాలు ఆరోపించారు. ఇదే ఆరోపణలపై విపక్ష పార్టీలపై బీజేపీ ఎదురు దాడికి దిగింది. దీంతో వచ్చే సమావేశానికి రావద్దని ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ను సస్పెండ్ చేస్తూ ఛైర్మన్ జగదంబికాపాల్ నిర్ణయం తీసుకున్నారు.

