Home Page Sliderhome page sliderNational

బాడీ కెమెరాలతో వీడియోలు తీసిన టెర్రరిస్టులు

పహెల్గాం మారణకాండను టెర్రరిస్టులు వీడియో తీసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. మతం అడుగుతూ టూరిస్టులపై కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు ఆ మొత్తం సన్నివేశాన్ని తమ బాడీ కెమెరాల్లో చిత్రీకరించారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను కలిసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన ప్రత్యేక బృందాలు మహారాష్ట్ర, ఒడిశా, వెస్ట్ బెంగాల్ సహా ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాయి. పాశవిక దాడి చేసిన టెర్రరిస్టుల కుట్రను బట్టబయలు చేసేందుకు ఎన్ఐఏ ప్రత్యక్ష సాక్షులను కలిసి ఆధారాలు సేకరిస్తుంది. బైసరన్ పరిసరాల్లోని అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 5 నుంచి 7 మంది ఉగ్రవాదులు ఈ పాశవిక దాడిలో పాల్గొని ఉంటారని ఎస్ఐఏ అధికారులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. పాక్ లో శిక్షణ పొందిన ఇద్దరు స్థానికులు వారికి సాయం చేసినట్లు ఆధారాలు సంపాదించారు.