తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతలు..
తైవాన్ జలసంధిలో చైనా నౌకాదళం ఉద్రిక్తత సృష్టిస్తోంది. చైనా గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తమ నౌకాదళాన్ని తైవాన్ చుట్టూ మోహరిస్తోంది. అయితే దీనిపై చైనా జవాబు చెప్తూ తైపీ వేర్పాటు వాదాన్ని సహించేదిలేదని హెచ్చరించింది. తైవాన్ ద్వీపం చుట్టుపక్కల సైనిక కార్యకలాపాలు పెంచింది. వేర్పాటువాద కార్యకలాపాలను ఏమాత్రం సహించలేమని చైనా పేర్కొంది. తైవాన్‌లోని వేర్పాటువాదులు బాహ్యశక్తులతో కుమ్మక్కయ్యే చర్యలపై చైనా అప్రమత్తంగా ఉందని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి, తైవాన్ జలసంధిలో సుస్థిరత నెలకొల్పడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అయితే తైవాన్ అధ్యక్షుడు తమ దేశంపై చైనా సార్వభౌమ హక్కులను అంగీకరించలేదు. చైనా తీవ్రమైన ముప్పుగా మారిందని వ్యాఖ్యానించారు.


 
							 
							