సుప్రీంకోర్టుకు చేరిన తెలంగాణ గ్రూప్ 1 వివాదం
తెలంగాణ గ్రూప్ 1 వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. గ్రూప్ 1 అభ్యర్థులు పరీక్షను ఇప్పుడు నిర్వహించకూడదని, జీవో 29ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సోమవారం జరగనుంది. తీర్పు వచ్చే వరకూ పరీక్ష నిర్వహించకూడదంటూ అభ్యర్థులు కోరుతున్నారు. గత జీవో 55నే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.