Home Page SliderTelangana

ఉప్పల్ స్టేడియంలో తెలంగాణా ఉద్యోగుల నిరసన

తెలంగాణాలో VRA ఉద్యోగుల నిరసనలు తారాస్థాయికి చేరాయి. అది ఎంతలా అంటే IPL జరుగుతున్న ఉప్పల్ స్టేడియంలో కూడా ఉద్యోగులు ఆందోళనలు చేపట్టారు. దీంతో ఇప్పటి వరకు ఇంటికే పరిమితమైన ఈ గుట్టు కాస్త రచ్చ కెక్కినట్లయ్యింది. నిన్న ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ VS RR మధ్య IPL మ్యాచ్‌ జరిగింది. కాగా ఈ మ్యాచ్‌కు హాజరయిన తెలంగాణా VRAలు ఇక్కడ కూడా ప్లకార్డులతో నిరసనలకు దిగారు. “మాకు పేస్కేలు అమలు చేయాలి” ప్లకార్డుల్లో రాశారు. వాటిని పట్టుకుని ప్రేక్షుకుల మధ్యలో నిల్చొని తమ నిరసనను వ్యక్తం చేశారు. కాగా దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారాయి.