తెలంగాణ ఎంసెట్ 2023 షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదలయ్యింది. ఈనెల 28న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 3 నుంచి ఏప్రిల్ 10 వరకు ఎంసెట్ దరఖాస్తులు స్వీకరిస్తారు. లేట్ పేమేంట్ చార్జీలతో మే 2 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఏప్రిల్ 30 నుంచి ఎంసెట్ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 7 నుంచి 9 వరకు ఇంజినీరింగ్ విభాగ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్, మెడిసిన్ విభాగానికి ప్రవేశ పరీక్ష జరుగుతుంది.

