HealthHome Page SliderInternational

పాక్‌లో ట్యాక్సీలు, లారీలపై నిషేధం

పాకిస్థాన్ దేశం విపరీతమైన కాలుష్యం బారిన పడి విలవిల్లాడుతోంది. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో వాయుకాలుష్యం 1900 ఏక్యూఐగా ఉంది. దీనివల్ల ఆటోలు, ట్యాక్సీలు, లారీలపై నిషేధం విధించారు. భారత్‌లోని దిల్లీలోని కాలుష్యం 400 ఏక్యూఐగా ఉంటేనే ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. అలాంటిది పాక్‌లో దానికి 4 రెట్లు పెరిగి పోవడం ఆందోళన కలిగిస్తోంది. మూడు మీటర్ల దూరంలోని వ్యక్తులు కూడా కనిపించనంతగా పొల్యూషన్ పెరిగిపోయింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యవంతమైన నగరంగా పేరు పొందింది. పలు ఆఫీసులకు, స్కూళ్లకు 10 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. రెస్టారెంట్లు మూసివేశారు. ప్రజలెవరూ ఇంట్లోంచి బయటకు రావొద్దని, ఇంట్లో ఉన్నా కూడా మాస్కులు ధరించాలని డాక్టర్లు చెప్తున్నారు. పలు ఆరోగ్య సమస్యలతో ప్రజలు ఆస్పత్రులలో చేరుతున్నారు.  ప్రభుత్వం కూడా సెలవులివ్వడం, నిషేధం విధించడం మినహా ఏం చేయలేక చేతులెత్తేసింది.