Home Page SliderNational

అంజలి కేసులో 11 మంది పోలీసుల సస్పెన్షన్

జనవరి 1న ఢిల్లీలో స్కూటీలో వెళ్తున్న యువతిని  కారు ఈడ్చుకెళ్లిన అమానుష ఘటనకు సంబంధించి అంతటా విమర్శలు రావడంతో కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.  ఆరోజు విధుల్లో ఉన్న 11 మంది పోలీసులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీరిలో ఒక డీసీపీ స్థాయి అధికారి కూడా ఉన్నారు. ఈ ఘటన జరిగిన రూట్‌లో డ్యూటీ చేసిన వారిపై ఈ చర్యలు తీసుకున్నారు. వీరు ఆరోజు మూడు పోలీస్ కంట్రోల్ రూం, పోలీస్ వ్యాన్లు, రెండు పికెట్లలో విధులు నిర్వహించారు.

మద్యం మత్తులో వాహనాన్ని నడిపి, అంజలి అనే యువతిని కారుతో ఢీకొట్టారు కొందరు యువకులు. ఆమె చక్రాల మధ్య ఇరుక్కున్నా కూడా 12 కిలోమీటర్లమేర రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఆమె ఎముకలు బయటికొచ్చి, నగ్నంగా రోడ్డుపై మృతదేహం దొరకడంతో ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు దారి తీసింది. పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనితో కేంద్ర హోంశాఖ ఈ చర్యలు తీసుకుంది.