సస్పెన్షన్ వల్ల నాకు ఒరిగేదేమి లేదు
ఇటీవల ఏపీలో జరిగిన MLC ఎలక్షన్స్‌లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా వీరిలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కూడా ఉన్నారు. అయితే ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ..ఈ సస్పెన్షన్ వల్ల తనకు జరిగే నష్టమేమి లేదని స్పష్టం చేశారు. కాగా ఆయన తాను ఆత్మప్రబోధానుసారం ఓటు వేశానన్నారు. తమకు ఓటు వేయాలని తనని TDP గానీ,YCP గానీ అడగలేదన్నారు. కానీ మరోపక్క వైసీపీ వాళ్లు మాత్రం తాము అమ్ముడు పోయామంటున్నారని వాపోయారు. అదే నిజమయితే TDP ఎమ్మెల్యేలకు ఎంత ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలా తప్పుడు ఆరోపణలు చేసినంత మాత్రాన తాను భయపడనని తెలిపారు. అంతేకాకుండా TDPలో చేరికపై ఇప్పుడే ఏమి చెప్పలేనని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వివరించారు.

