కామన్వెల్త్ బ్యాడ్మింటన్‌లో రజత పతకం
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీం విభాగంలో రజత పతకం సాధించింది. దీంతో ఈ గేమ్స్‌లో భారత్ ఖాతాలో 13వ పతకం చేరింది. మిక్స్‌డ్ టీం ఫైనల్లో భారత్ 1-3 తేడాతో మలేషియా చేతిలో ఓడిపోయింది. పీవీ సింధు మినహా ఇతర ఆటగాళ్లంతా ఓడిపోవడంతో భారత్ రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.