లెక్కలు తీయండి…
ఇప్పటి వరకు మునుగోడు నియోజకవర్గంలో ఎంత ఖర్చు పెట్టారో లెక్కలు తీయాలంటీ బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నియోజకవర్గాలను బాాగా అభివృద్ధి చేస్తున్నామని డంబాలు కొట్టుకుంటున్న కేసీఆర్ మునుగోడు అభివృద్ధికి విడుదల చేసిన నిధులెన్నో చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గాలంటే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ మాత్రమే కాదని .. ఇంకా చాలా ఉన్నాయని కమలనాధులు మండి పడ్డారు. కేసీఆర్ సర్కార్ చెబుతున్నది ఒకటి.. చేస్తున్నది మరొకటి అంటూ నిప్పులు కక్కారు. డాబుసరి మాటలు తప్పించి కేసీఆర్ నియోజకవర్గాలకు చేస్తున్నది ఏమీ లేదని బీజేపీ విమర్శిస్తోంది. ఎక్కడన్నా ఉప ఎన్నిక వస్తే కానీ ఆయా నియోజకవర్గాలకు నిధులు విడుదల చెయ్యడం లేదని ఆరోపిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక భయం ఆ పార్టీలో స్పష్టంగా కనిపిస్తోందని .. కేసీఆర్ వెన్నులో వణుకు మొదలైందని కమలనాధులు అంటున్నారు. ఈ ఎన్నిక కేసీఆర్ కు ఓ గుణపాఠం కాగలదని చెబుతున్నారు. నియోజకవర్గంలో పార్టీ బలీయమైన శక్తిగా ఎదిగిందని .. ప్రజల్లో ఓ విశ్వాసాన్ని కలగచేస్తోందని బీజేపీ నేతలు అంటున్నారు.


