Home Page SliderNational

స్కూల్ యూనిఫామ్‌ వేసుకుని దోచేసింది

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఒక యువతి చాలా తెలివిగా స్కూటీని దొంగతనం చేసింది. స్కూల్ విద్యార్థినిలా యూనిఫామ్ వేసుకుని, బ్యాగ్ తగిలించుకుని కబీర్‌నగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లింది. అక్కడ ఒక స్కూటీ దారికి అడ్డుగా ఉందని, పక్కకి జరిపి ఇస్తానని చెప్పి, ఇంటివారిని తాళాలు అడిగి తీసుకుంది. ఆమె స్కూల్ విద్యార్థినిలా కనిపించడంతో వారు అనుమానించలేదు. అయితే ఆమె ఆ స్కూటీని డ్రైవ్ చేసుకుంటూ పలాయనం చిత్తగించింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డవగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.