రెండవ అతి పెద్ద బిగ్ బ్యాంగ్- గామా విస్ఫోటనం
మనసర్కార్
ఈ అనంత విశ్వంలో నక్షత్రాల మధ్య అనేక రకాల విస్ఫోటనాలు మామూలే. అయితే అతి పెద్ద విస్ఫోటనంగా శాస్త్రవేత్తలందరూ భావిస్తున్న, ఈ విశ్వసృష్ఠికి మూలకారణమని అనుకుంటున్న బిగ్ బ్యాంగ్ తర్వాత అంతటి ప్రకాశవంతమైన, శక్తివంతమైన విద్యుదయస్కాంత ఘటనను చైనా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. భూమ్యాకాశాల నుంచి జరిపిన పరిశీలనల ద్వారా తాము కనుగొన్న ఈ బృహత్తర విస్ఫోటనానికి వీరు జి.ఆర్.బి. 221009ఏ అని పేరు పెట్టారు. ఈ విస్ఫోటనం మానవాళి ఇంతవరకూ వీక్షించిన గామా కిరణ విస్ఫోటనాల కన్నా 10 రెట్లు పెద్దదని వారు తెలియజేశారు. ఇవి సూర్యుడు తన జీవితకాలంలో వెలువరించే మొత్తం కన్నా ఎక్కువ శక్తి కన్నా ఎక్కువ శక్తిని కేవలం కొన్ని సెకన్ల కాలంలో విరజిమ్ముతోందట. సూర్యుడి కన్నా కొన్ని వందల రెట్లు ద్రవ్యరాశి కలిగిన నక్షత్రాలు పేలిపోయినప్పుడు ఎక్కువ సేపు కనిపించే జి.ఆర్.బి లు పుడతాయట. ఇవి గురుత్వాకర్షణ అలలను సృష్టిస్తాయట. వీటిని భూమిపై ఉన్న లాసో ప్రయోగశాల, రోదసిలోని గామా కిరణ శోధన సాధనం, ఎక్స్ రే టెలిస్కోప్ ల సహాయంతో దీనిని కనిపెట్టారు. ఇది భూమికి 200 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో సంభవించిందట.

