Home Page SliderNational

క్రికెటర్ సెలక్టర్ పోస్టులకు సచిన్, ధోనీ, సెహ్వాగ్‌, ఇంజమామ్ దరఖాస్తు?

జాతీయ సెలక్షన్ కమిటీ అభ్యర్థుల CVలను తనిఖీ చేయడానికి BCCI మెయిల్స్ చెక్ చేస్తున్నప్పుడు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్‌ల నుండి దరఖాస్తులు రావడంతో వారు షాక్‌కు గురయ్యారు. అదే సమయంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ కూడా తన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించినట్టుగా మెయిల్స్ వచ్చాయి. ఐతే ఈ CVలన్నీ BCCIని కంగుతినిపించేందుకేనని విచారణలో తేలింది. కొంత ఆనందాన్ని పొందాలనుకునే మోసగాళ్లు స్పామ్ ఇమెయిల్ ఐడిలను ఉపయోగించి పోస్ట్ చేసినట్టు బీసీసీఐ గుర్తించింది. ఐదుగురు సభ్యుల సెలక్షన్ ప్యానెల్ కోసం బీసీసీఐకి 600కు పైగా ఈ-మెయిల్ దరఖాస్తులు అందాయి. వాటిలో కొన్ని టెండూల్కర్, ధోనీ, సెహ్వాగ్, ఇంజమామ్ అని చెప్పుకునే నకిలీ ఐడీల నుండి వచ్చాయి. క్రికెట్ సలహా కమిటీ ఉన్నత స్థాయి స్థానాలకు 10 పేర్లను షార్ట్‌లిస్ట్ చేస్తుందని భావిస్తున్నారు. “దాదాపు 600 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో కొన్ని ధోనీ, సెహ్వాగ్ మరియు టెండూల్కర్ అని చెప్పుకునే నకిలీ ఐడిల నుండి వచ్చాయి. వారు అలా చేయడం ద్వారా బిసిసిఐ సమయాన్ని వృధా అయ్యింది.

“CAC 10 మంది అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తుంది, ఆపై చివరి ఐదుగురిని ఎంపిక చేస్తుంది. ప్రక్రియ త్వరలో పూర్తవుతుంది” అని BCCI పీటీఐకి తెలిపింది. గత నెల T20 ప్రపంచ కప్ నుండి జట్టు సెమీఫైనల్ నిష్క్రమణ తర్వాత చేతన్-శర్మ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్‌ను BCCI తొలగించింది. అయినప్పటికీ, ఆ ప్యానెల్ వారి వారసులను ఖరారు చేయకపోవడంతో విధుల్లో ఈ వారు కొనసాగుతున్నారు. కమిటీ రంజీ ట్రోఫీ మొదటి రౌండ్‌ను కూడా పరిశీలించింది. రెండో రౌండ్‌ను నిశితంగా గమనిస్తోంది. బెంగాల్ వర్సెస్ హిమాచల్ ప్రదేశ్ మ్యాచ్ చూస్తున్న దేబాశిష్ మొహంతి కోల్‌కతాలో వీక్షిస్తున్నారు. బుధవారం, BCCI అపెక్స్ కౌన్సిల్ ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్‌లను క్లియర్ చేయలేకపోయింది. సెలక్షన్ కమిటీ ఇంకా ఏర్పడకపోవడంతో, జాబితాను ఖరారు చేయడానికి ఇన్‌పుట్స్ కావాల్సి ఉంది. ఈ నెల ప్రారంభంలో నియమించిన అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజ్‌పే, సులక్షణ నాయక్‌లతో కూడిన CAC పనిని పూర్తి చేయడానికి త్వరలో సమావేశం కానుంది. సెంట్రల్ కాంట్రాక్ట్‌లను నిర్ణయించడంతోపాటు, జనవరి 3 నుంచి శ్రీలంక, న్యూజిలాండ్‌తో స్వదేశీ సిరీస్‌లకు జట్లను ఎంపిక చేయడం సెలక్షన్ ప్యానెల్‌కు సవాలుగా మారింది.