బ్రిటన్ ప్రధాన మంత్రిగా రుషి సునక్
దీపావళి రోజు భారతీయులకు గుడ్ న్యూస్. బ్రిటన్ ప్రధాన మంత్రిగా రిషి సునక్ ఎన్నికయ్యారు. ప్రధానిగా ఎన్నికయ్యి రిషి చరిత్ర సృష్టించారు. భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తి బ్రిటిష్ ప్రధాని కావడం నిజంగా సంచలనం. రేసులో ఉన్న పెన్నీ మోర్డాంట్ వంద మంది ఎంపీల మద్దతు పొందకపోవడంతో ఇక రుషి సునక్‌కు అడ్డులేకుండా పోయింది. ప్రధాని రేసు నుంచి ఆమె వైదొలగడంతో… సునక్ ప్రధాని పదవికి మార్గం సుగమం అయ్యింది. బోరిస్ జాన్సన్ ప్రధానిగా రాజీనామా చేసిన తర్వాత రిషి సునక్ నియమితులవుతారని అందరూ భావించారు. కానీ అది జరగలేదు. రిషికి పీఠం దక్కకుండా బోరిస్ జాన్సన్ చివరి వరకు ప్రయత్నించారు. రిషికి ప్రస్తుతం పార్లమెంట్లో 142 మంది ఎంపీల మద్దతు ఉంది. వంద మంది ఎంపీల సంఖ్యను దాటితే వారు ప్రధాని పదవికి అర్హులు. లిజ్ ట్రస్ రాజీనామా తర్వాత తనకు అనుకూలంగా పరిణామాలను మలచుకోవడంలో రిషి విజయవంతమయ్యారు.
దేశ ఆర్థిక పరిస్థితులను మార్చేస్తానంటూ భారతీయ సంతతికి చెందిన రిషి సునక్ స్పష్టం చేస్తున్నారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని బోరిస్ జాన్సన్ ప్రయత్నించినా ఆయన వంద మంది ఎంపీల మద్దతు కూడగట్టడం కష్టమని భావించి రేసు నుంచి వైదొలిగారు. తనకు అకాశం ఉన్నప్పటికీ ఇది సరైన సమయం కాదన్నారు జాన్సన్. బోరిస్ ప్రధాని రేసు నుంచి వైదొలగడంతో ఆయనను ఆకాశానికెత్తారు రిషి సునక్. ఉక్రెయిన్ యుద్ధం, బ్రిఎగ్జిట్, కరోనా వ్యాక్సిన్ల విషయంలో ఆయన పాత్ర అనీర్వచనీయామన్నారు. ప్రధాని రేసులో లేనప్పటికీ ఆయన ప్రజా సేవలో కొనసాగుతారని విశ్వసిస్తున్నానన్నారు.
ప్రధాని రేసులో ఉన్నానని ప్రకటించిన పెన్ని మోర్డాంట్ వంద ఎంపీ ఎంపీల మద్దతు కూడగట్టాలని భావించినా ఆమెకు 29 మంది మాత్రమే మద్దతిచ్చారు. దీంతో రిషి సునక్ ఆటోమేటిగ్గా ప్రధానిగా ఎన్నుకోబడతారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతను వివాహం చేసుకున్న రిషి, పట్ల భారతీయుల్లో ఆరాదన భావం నెలకొంది. ఇండియా అల్లుడు, ఇండియా సంతతి వ్యక్తి బ్రిటన్ ప్రధాని కావడం చాలా గొప్ప విషయమని భారతీయులు భావిస్తున్నారు.

