సెంచరీతో అదరగొట్టిన రోహిత్, అర్ధ శతకంతో రాణించిన జడేజా
భారత్ vs ఆస్ట్రేలియా మొదటి టెస్టు రెండో రోజు టీమ్ ఇండియా రాణించింది. రవీంద్ర జడేజా 18వ టెస్ట్ హాఫ్ సెంచరీని సాధించాడు. మరో ఎండ్‌లో అక్షర్ పటేల్‌తో కలిసి బ్యాటింగ్ చేస్తున్నాడు. కేఎస్ భరత్ వికెట్‌తో టీమ్ ఇండియా ఏడు వికెట్లు కోల్పోయింది. ఐదు వికెట్ల పడిపోయిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన జడేజా ఆల్‌రౌండర్‌గా తన సత్తాను నిరూపించుకోవడానికి యాభై పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనం సూపర్ అని నిరూపించుకున్నాడు.
అంతకుముందు వ్యక్తిగత స్కోరు 120 వద్ద పాట్ కమ్మిన్స్ వేసిన ఒక బంతికి రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ తన మొదటి సెంచరీని నమోదు చేశాడు. మొదటి టెస్ట్ మ్యాచ్ రెండో రోజున చారిత్రక సెంచరీని కొట్టాడు. మరో ఎండ్‌లో క్రమం తప్పకుండా వికెట్లు పడిపోయినప్పటికీ, రోహిత్ నిలకడగా బ్యాటింగ్‌ను కొనసాగించి సెంచరీ సాధించాడు. తాజా సెంచరీతో రోహిత్ టెస్టుల్లో తొమ్మిదోది. టెస్టులు, ODIలు, T20Iలు — మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన క్రికెటర్లలో రోహిత్ 4వ కెప్టెన్ అయ్యాడు. ఫాఫ్ డు ప్లెసిస్, తిలకరత్నే దిల్షాన్, బాబర్ ఆజం ఇప్పటి వరకు ఈ రికార్డు సృష్టించారు. రోహిత్ రికార్డు చరిత్ర సృష్టించిన తర్వాత… భారత డ్రెస్సింగ్ రూమ్ మొత్తం లేచి నిలబడి అభినందించింది. రోహిత్ తన సెంచరీని చేరుకోవడానికి 171 బంతులు పట్టింది.
ఇక ఆస్ట్రేలియా జట్టులో టాడ్ మర్ఫీ ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు ఐదు వికెట్లు పడగొట్టగా, నాథన్ లియాన్ ఒక వికెట్ తీశాడు. మొదటి రోజు, ఆస్ట్రేలియాను 177 పరుగులకు ఆలౌట్ చేసిన తర్వాత భారత్ 1 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 22 ఓవర్లలో తన 11వ ఐదు వికెట్లు (47 పరుగులకు 5) సాధించి, ఆ తర్వాత ఆస్ట్రేలియాను స్వల్ప స్కోరుకే ఆలౌట్ చేయడంలో సహాయపడింది. రవిచంద్రన్ అశ్విన్ 42 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ క్రికెట్‌లో 450 వికెట్లు పూర్తి చేశాడు.

