IPL లో మెరిసిన రిషబ్ పంత్
ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ కొన్ని రోజుల క్రితం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన మోకాలికి తీవ్ర గాయం అయ్యింది. దీంతో పంత్ ఈ IPL సీజన్‌కు దూరమయ్యాడు. అయితే నిన్న జరిగిన ఢిల్లీ-గుజరాత్ మ్యాచ్‌కి పంత్ హాజరయ్యారు. పంత్ ఊత కర్ర సహయంతో నడుస్తూ..కనిపించారు. బీసీసీఐ ఉన్నతాధికారులు కూర్చునే గ్యాలరీలో నుంచి పంత్ మ్యాచ్‌ను వీక్షించారు. ఈ ఢిల్లీ కెప్టెన్ మోకాలి గాయం కారణంగా ఈ IPL సీజన్‌కు దూరమయిన నేపథ్యంలో లక్నోతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు పంత్ జెర్సీని డగౌట్‌లో వేలాడదీసింది. అయితే దీనిపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పంత్ జెర్సీని ఇలా డగౌట్‌లో ఉంచొద్దని ఢిల్లీ ఫ్రాంచైజీకి బీసీసీఐ సూచించింది. కాగా అంతిమ విషాదం లేదా రిటైర్మెంట్ సమయంలోనే ఇలాంటివి చేస్తారని పేర్కొంది.అయితే పంత్ క్షేమంగానే ఉన్నాడని అనుకున్న దానికంటే చాలా వేగంగానే కోలుకుంటున్నాడని బీసీసీఐ తెలిపింది. ఢిల్లీ జట్టు ఓ మంచి ఉద్దేశ్యంతోనే ఇది చేసినా..ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యొద్దని బీసీసీఐ వారిని హెచ్చరించినట్లు ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.

