Home Page SliderNationalNewsPolitics

‘పాక్‌కు వద్దు, ఆ నీరు మాకు పంపండి’..ముఖ్యమంత్రి

హర్యాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ భాక్రానంగల్ డ్యామ్ నీరు తమ రాష్ట్రానికి ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాక్, భారత్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్‌కు సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసినందువల్ల ఈ ప్రాజెక్టు నీరు కూడా ఆ పరిధిలోకే వస్తుంది. దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టుగా పేరుపొందిన ఈ డ్యామ్ సట్లెజ్ నదిపై ఉంది. భాక్రాలో అదనపు నీరు తమ రాష్ట్రానికి ఇస్తే, వర్షాకాలంలో వచ్చే నీటిని నిల్వ చేసుకోవచ్చని ఆయన అభ్యర్థించారు. రిజర్వాయర్‌ నిండిపోతే అదనపు జలాలు హరి-కె-పట్టాన్ నుండి పాకిస్తాన్‌లోకి వెళ్లిపోతాయని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీటిని విడుదల చేసిందని, ఇప్పుడు పంజాబ్‌లోని ప్రభుత్వం హర్యాణాకు రావలసిన నీటిని విడుదల చేయడం లేదని వాపోయారు. పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీలకు పోగా మిగిలిన కాస్త నీటిని మాత్రమే హర్యాణాకు పంపుతున్నారని సైనీ పేర్కొన్నారు. అలాగే జీలమ్, చీనాబ్ వంటి నదుల నీటిని వ్యవసాయ అవసరాల కోసం ఇవ్వాలని కోరారు.