Home Page SliderNational

ఆసియా కప్ ఆర్చరీ టోర్నీలో స్వర్ణం సాధించిన RBI అధికారి

రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి ఆర్చరీ టోర్నీలో స్వర్ణం సాధించారు. ఆసియా కప్ 2023 ఆర్చరీ టోర్నీ సింగపూర్ వేదికగా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో భారత్‌కు చెందిన పార్థ్ సలుంఖే అదరగొట్టారు. యూత్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ల రికర్వ్ విభాగంలో స్వర్ణం గెలిచిన మొదటి భారతీయ మెన్ ఆర్చర్‌గా పార్థ్ నిలిచారు. అయితే ఈయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో పార్థ్ అభినందిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. భవిష్యత్తులో కూడా పార్థ్ మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.