ఉస్మానియాలో అరుదైన ఆపరేషన్..
హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి అరుదైన ఘనతను సాధించింది. ప్రభుత్వ రంగ ఆసుపత్రులలో మొదటి సారిగా చిన్న ప్రేగు మార్పిడి శస్త్ర చికిత్స చేసిన డాక్టర్లుగా ఉస్మానియా వైద్యులు నిలిచారు. భారతదేశ వైద్య చరిత్రలోనే తొలి సారి చిన్న ప్రేగు మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతం చేసి 40 ఏళ్ల రోగికి ప్రాణం పోశారు. ఈ రోగిని ఢిల్లీ ఎయిమ్స్‌కు కూడా తీసుకెళ్లామని, కానీ ఏమీ చేయలేకపోయారని బంధువులు తెలిపారు. 40 ఏళ్ల వయస్సున్న ఓ వ్యక్తికి చిన్న పేగు పూర్తిగా పాడవ్వడంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. అక్కడ వైద్యులు అతనికి చికిత్స చేసి పాడపోయిన చిన్న ప్రేగును తొలగించారు. దీంతో బాధితుడు ఏమీ తినలేక, తాగలేక ఐవీ ప్లూయిడ్లతో మాత్రమే కాలం గడుపుతున్నాడు. దీంతో శరీరాని సరైన పోషకాలు అంతక పోవడంతో ఆయన ఆరోగ్యం బాగా క్షిణించింది. అయితే చిన్న పేగు మార్పిడి చేస్తే రోగి బతికే పరిస్థితి ఉందని వైద్యులు చెప్పడంతో.. బాధిత కుటుంబ సభ్యులు అతన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ కూడా ఫలితం లేకపోవడంతో చివరకు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి నుంచి చిన్నపేగును భద్రంగా తొలగించిన వైద్య బృందం.. సుమారు 12 గంటల పాటు శ్రమించి దానిని విజయవంతంగా బాధితుడికి అమర్చారు.