Home Page SliderTelangana

పుష్ప 2లో రామ్ చరణ్ తేజ

అల్లు అర్జున్ పుష్ప సూపర్ సక్సెస్ అయ్యింది. సౌత్ ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా హిందీ బెల్ట్‌లో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. భారీ కథాంశం, బ్లాక్‌బస్టర్ పాటలతో ఊపేసింది. ఇప్పుడు సీక్వెల్ నిర్మాణం జరుగుతుండటంతో… అభిమానులు ఉత్సాహాన్ని ఆపుకోలేకపోతున్నారు. పుష్ప 2 కోసం హైప్ పెరుగుతున్నందున, అల్లు అర్జున్ మాస్ చిత్రంలో RRR ఫేమ్ రామ్ చరణ్ అతిధి పాత్రలో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పుష్ప తారాగణం, సిబ్బంది రష్యాలో గ్రాండ్ ప్రీమియర్ తర్వాత ఎట్టకేలకు తిరిగి వచ్చారు. పుష్ప 2 షూటింగ్ కిక్‌స్టార్ట్ చేయబోతున్నారు. చిత్రనిర్మాత సుకుమార్ సీక్వెల్‌ను భారీ స్థాయిలో, మరింత వినోదాత్మకంగా రూపొందించాలని నిర్ణయించారు. ప్రేక్షకులను గరిష్టంగా అలరించడానికి, సుకుమార్ రామ్ చరణ్‌ను సినిమాలో నటింపజేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో సుకుమార్ రామ్ చరణ్‌తో రంగస్థలం సినిమాను తీయగా.. అది బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. గతంలో ఇద్దరూ ఎవడు చిత్రంలో నటించినా… రామ్ చరణ్… తాజా సినిమాలో కన్పించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎటువంటి అధికారిక ప్రకటనలు చేయనప్పటికీ, RRR స్టార్ అల్లు అర్జున్‌తో స్క్రీన్‌ను పంచుకోవడం గురించి ఊహాగానాలు విన్పిస్తున్నాయి.