పుష్ప 2, రష్మిక సాంగ్ రెడీ, రేపే విడుదల
రేపు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు పుష్ప 2 సెకండ్ సింగిల్ విడుదల చేయనున్నట్టు, హీరోయిన్ రష్మిక మందన ఎక్స్ ద్వారా సమాచారాన్ని షేర్ చేసుకుంది. రేపు, శ్రీవల్లికి స్వాగతం పలుకుతూ విడుదల వేడుకలు జరుపుకుంటామంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ట్రెండింగ్ పార్టీతో పెద్ద డ్రాప్ కోసం సిద్ధంగా ఉండండంటూ రాసుకొచ్చారు. పాట విడుదలైన వెంటనే ట్రెండ్ స్టార్ట్ చేస్తామంటూ పేర్కొన్నారు.