Breaking NewsHome Page SliderTelangana

16రోజుల్లో 3వేల ఈవి వాహ‌నాలు కొనుగోళ్లు

తెలంగాణలో విద్యుత్‌ వాహనాల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఈవీ పాలసీ వాహనదారుల్ని ఆకర్షిస్తుండడంతో కార్లు, ఆటోలు, మోటార్‌ సైకిళ్ల కొనుగోలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాల వల్ల కాలుష్యం పెరుగుతోందంటూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 18న ఈవీ కొత్త పాలసీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు ఈవీ వాహనాలకు రోడ్డు ట్యాక్స్‌తోపాటు రిజిస్ట్రేషన్‌ ఫీజును రవాణాశాఖ పూర్తిగా మినహాయించింది. దీంతో ఈ నెల 3 వరకు సుమారు 16 రోజుల్లోనే 3 వేల 372 ఎలక్ట్రిక్‌ వాహనాలు రవాణాశాఖ కార్యాలయాల్లో రిజిస్టర్‌ అయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈవీ వాహనాలపై ప్రకటించిన రాయితీల ద్వారా వీటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. డిసెంబర్​ 9 నుంచి ఇప్పటివరకు 78 వేల 262 కొత్త ఎలక్ట్రిక్‌ వాహనాల విక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరిగాయని రవాణాశాఖ తెలిపింది. అంతకముందు ఏడాదిలో 51,934 ఈవీల రిజిస్ట్రేషన్‌ జరిగిందని పేర్కొంది. గత ప్రభుత్వ హయాంతో పోలీస్తే తమ ఏడాది పాలనలో ఈవీల రిజిస్ట్రేషన్లు 52.28 శాతం పెరిగాయని తెలిపింది.