Home Page SliderTelangana

మాదిగలకు అండగా ఉంటాం.. చరిత్ర తిరగరాస్తానన్న ప్రధాని మోడీ

పరేడ్ గ్రౌండ్‌లో ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభ విజయవంతం
విశ్వరూప సభకు భారీగా తరలివచ్చిన ఎమ్మార్పీఎస్ శ్రేణులు
తెలుగు రాష్ట్రాల నుంచి సభకు తరలివచ్చిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు

సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, సభలో పాల్గొన్న తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ , బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి . మహాసభ వేదికపై కంటతడి పెట్టిన మందకృష్ణ-ఓదార్చిన ప్రధాని మోదీ.

జి.కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు

ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న నాయకుడు.. మోదీజీ. మందకృష్ణ మాదిగ 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలని అంబేడ్కర్ చెప్పారు. అన్ని వర్గాలకూ ఫలాలు అందాలనేదే మా విధానం. ప్రధాని మోదీజీకి మొత్తం మాదిగలంతా చేతులెత్తి నమస్కరిస్తున్నాం.

మందకృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు

కాంగ్రెస్‌, బీఆర్ఎస్.. కేవలం మాటలే చెబుతున్నాయి. మా ఆకాంక్షలు నెరవేర్చేది బీజేపీనే.. బలహీనవర్గాలకు అండగా ఉండే పార్టీ బీజేపీనే.. తెలంగాణకు బీసీని సీఎంగా చేస్తామని ప్రకటించింది ఒక్క బీజేపీనే. మోదీ గారికికి సామాజిక స్పృహ ఉంది కనుకే మా సభకు వచ్చారు. ఇచ్చినమాటను నిలబెట్టుకునే నేత.. ప్రధాని మోదీ. బలహీనవర్గాల నుంచి వచ్చారు కనుకే మోదీకి మా కష్టాలు తెలుసు. కేసీఆర్‌ మంత్రివర్గంలో ఒక్క మాదిగ వ్యక్తి లేరు. తక్కువ జనాభా ఉన్న కులాలకు ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చారు.
కర్ణాటక నుంచి నారాయణస్వామిని కేంద్రమంత్రిని చేసిన ఘనత మోదీది. ముస్లిం ఆడపిల్లల కష్టాలు తొలగించేందుకు ట్రిపుల్ తలాక్ చట్టం తెచ్చారు. ఎస్సీలో మాదిగలకు అన్యాయం జరుగుతోంది. మాదిగలకు అన్యాయం జరిగిందని అనేక కమిషన్లు చెప్పాయి. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో మాదిగలకు అన్యాయం జరుగుతోంది.

ఎస్సీ వర్గీకరణ జరిగితేనే అంత్యోదయ ఫలాలు అందుతాయి. ప్రధాని మోదీ గుండె గట్టిది.. మనసు మాత్రం వెన్నపూస. మోదీని మించిన నాయకుడు లేరు.. భవిష్యత్తులో రారు. మోదీ మాట ఇస్తే తప్పరని ప్రజల్లో బాగా విశ్వాసం ఉంది. తమిళనాడులో ఎన్నికల్లో ఓడిన మురుగన్‌ను కేంద్రమంత్రి చేశారు. ఈడబ్యూఎస్‌ రిజర్వేషన్లు తీసుకువచ్చిన ఘనత మోదీదే. ఏళ్ల తరబడి కాంగ్రెస్‌ ఊరించిన మహిళా బిల్లును మోదీ తెచ్చారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కరించాలని మోదీని కోరుతున్నా. ఈ సభకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ నుంచి కూడా అనేకమంది వచ్చారు. ఎస్సీ వర్గీకరణ చేస్తే పార్టీలకు అతీతంగా మోదీకి అండగా ఉంటాం. వర్గీకరణ చేస్తే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకు అండగా ఉంటాం. పార్టీలకు అతీతంగా మాదిగలంతా మోదీకి అండగా ఉందాం. మోదీ అంటే శత్రుదేశాలకు భయం.. మనదేశ ప్రజలకు అభయం.

నరేంద్ర మోదీ, ప్రధాని

తెలుగులో మాట్లాడి ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ. సమ్మక్క, సారమ్మను గుర్తు చేసిన ప్రధాని మోదీజీ. ఇది అణగారిన వర్గాల విశ్వరూప మహాసభ. మందకృష్ణ మాదిగ.. నా చిన్న తమ్ముడు. తెలంగాణ మాదిగ సమాజానికి అభినందనలు. ఇంతగా ఆత్మీయత చూపించిన దళిత సమాజానికి ధన్యవాదాలు. ఎంతో ప్రేమతో ఈ సభకు నన్ను ఆహ్వానించారు. స్వాతంత్ర్యం వచ్చాక అనేక ప్రభుత్వాలను చూశారు. ఆ ప్రభుత్వాలకు, మా ప్రభుత్వానికి తేడా గమనించాలి. సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌.. అనేది మా విధానం. సామాజిక న్యాయం చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం. గుర్రం జాషువాను ప్రేరణగా తీసుకుంటున్నాం. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. మూడు దశాబ్దాల మాదిగల ఉద్యమానికి నా సంపూర్ణ మద్దతు. పేదరిక నిర్మూలనే మా ప్రథమ ప్రాధాన్యం. మీ బాధలు పంచుకునేందుకే నేను ఇక్కడకు వచ్చా. న్యాయం చేస్తామని చెప్పి అనేక పార్టీలు మిమ్మల్ని వాడుకున్నాయి. మీరంతా.. వన్‌ లైఫ్‌.. వన్‌ మిషన్‌లా పోరాటం చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేస్తోంది. దళిత నేతను సీఎం చేస్తామని బీఆర్‌ఎస్‌ నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌ సీఎం కుర్చీలో కూర్చున్నారు.

రైతులకు రుణమాఫీ చేస్తామని మోసం చేశారు. ప్రస్తుతం తెలంగాణ సంకట పరిస్థితిలో ఉంది. తెలంగాణ అస్తిత్వాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాపాడలేకపోయింది. దళితుల ఆశలపై నీళ్లు చల్లింది కేసీఆరే. దళితులకు మూడెకరాలు ఇస్తామన్నారు.. ఇవ్వలేదు.. దళితబంధు పథకం వల్ల బీఆర్‌ఎస్‌ నేతలకే మేలు జరిగింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు.. మాదిగ విరోధులు. కాంగ్రెస్ పార్టీ.. అంబేడ్కర్‌ను ఎన్నికల్లో రెండుసార్లు ఓడించారు. కాంగ్రెస్‌ పార్టీ.. పార్లమెంట్‌లో అంబేడ్కర్‌ చిత్రపటం కూడా పెట్టలేదు. అంబేడ్కర్‌కు భారతరత్న కూడా ఇవ్వలేదు ఈ కాంగ్రెస్ పార్టీ. మేం వచ్చాకే అంబేడ్కర్ ఫొటో పెట్టాం.. భారతరత్న ఇచ్చాం. దళిత వ్యక్తి రాష్ట్రపతి కావడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. దళిత బిడ్డ రామ్‌నాథ్‌ కోవింద్‌ను కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకించింది. దళిత నేత బాబూ జగ్జీవన్‌రామ్‌ను కాంగ్రెస్ అనేక రకాలుగా వేధించింది. బిహార్‌ అసెంబ్లీలో దళితబిడ్డ జితన్‌రామ్ మాంఝీని అవమానించారు. దళితులు అంటే బిహార్‌ సీఎం నీతీశ్‌కుమార్‌కు చిన్నచూపు.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌.. అవినీతి పార్టీలు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌తో కలిసి డ్రామాలు ఆడుతోంది. ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వంతో కలిసి అవినీతి చేస్తున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పట్ల ప్రజలు అప్రమత్తం కావాలి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయి. పేదవాళ్లు అభివృద్ధి చెందాలనేదే మా నినాదం. కేంద్ర పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలే ఎక్కువ లబ్ధి పొందుతున్నాయి. అవినీతికి పాల్పడటంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వేర్వేరు కాదు. బీఆర్‌ఎస్‌.. దిల్లీలోని ఆప్‌తో కలిసి మద్యం కుంభకోణానికి పాల్పడింది. లక్షలమంది దళిత విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించాం. బడుగువర్గాల బాగు కోసమే బీజేపీ ఎప్పుడూ పనిచేస్తోంది. రైతులకు అండగా ఉండేందుకు వరికి మద్దతు ధర పెంచాం. ఖరీఫ్‌లో తెలంగాణ రైతుల నుంచి 20 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ కొంటాం. గరీబ్ కల్యాణ్‌ అన్న యోజన పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు కొనసాగిస్తాం. బడుగువర్గాల బాగు కోసమే బీజేపీ ఎప్పుడూ పనిచేస్తోంది.