రేపు రాష్ట్రానికి రాష్ట్రపతి.. షెడ్యూల్ విడుదల
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఒక రోజు పర్యటన కోసం శనివారం రాష్ట్రానికి రానున్నారు. ఉదయం 9.40 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు బయల్దేరుతారు. ఉదయం 11.40 గంటలకు హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి 12.10 గంటలకు శామీర్ పేట్ లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాకు చేరు కుంటారు. మధ్యాహ్నం 12.20 గంటల నుంచి ఆ కార్యక్రమంలో పాల్గొం టారు. మధ్యాహ్నం 1.05 నిమిషాలకు నల్సార్ యూనివర్సిటీ కార్యక్రమంలో రాష్ట్రప తి ప్రసంగం ఉంటుంది. మధ్యాహ్న భోజనం అనంతరం 3-10 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు. సాయంత్రం 4 గం టలకు భారతీయ కళా మహోత్సవ్ 2024 ప్రారంభోత్సవంలో పాల్గొం టారు. కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రుల సన్మానాలు, వారి ఉపన్యాసాల అనంతరం.. సాయంత్రం 5.05 గంటలకు రాష్ట్రపతి ముర్ము తన ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, గ్రూప్ ఫొటో అనంతరం సాయంత్రం 5.45 గంటలకు రాష్ట్రపతి నిలయం నుంచి హకీంపేట్ ఎయిర్ పోర్టుకు బయల్దేరతారు. హకీంపేట్ ఎయిర్ పోర్టు నుంచి సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక విమానంలో ఆమె ఢిల్లీకి తిరిగి వెళ్తారు.

