పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల ఫలితాలు విడుదల
ఆంధ్రప్రేదేశ్‌లో పాలిసెట్ 2024 ఫలితాలను సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నాగరాణి విడుదల చేశారు. మొత్తం లక్షా 42 వేల మంది పరీక్ష రాయగా, లక్షా 24 వేల మంది అర్హత సాధించారు. బాలుర కంటే బాలికలు ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు. ఏపీలో మొత్తం 267 పాలిటెక్నిక్ కాలేజీలుండగా వాటిలో 82,870 సీట్లు అందుబాటులో ఉన్నాయి. త్వరలో కౌన్సిలింగ్ జరగనుండగా విద్యా సంవత్సరం జూన్ 10న ప్రారంభమవుతుంది.

