Andhra PradeshHome Page Slider

ఏపీలో పోలింగ్ పెరిగిందా? తగ్గిందా?

ఏపీలో పోలింగ్ పెరిగిందా.. తగ్గిందా అన్నదానిపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. ఈసీ ఇప్పటి వరకు విడుదల చేసిన లెక్కల ప్రకారం ఏపీలో పోలింగ్ 78.36 శాతం అంటూ లెక్కలు వస్తున్నాయ్. ఈ మొత్తం లెక్కలు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతోనా, కాదా అన్నది తేలాల్సి ఉంది. ఒక అంచనా ప్రకారం ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 4,44,216 పోలయ్యాయి. ఏపీలో మొత్తం ఓట్లు సుమారుగా 4,08,07,256 ఉన్నాయి. ఈ లెక్కన ఏపీలో మొత్తం పోలైన ఓట్ల పర్సంటేజ్ సుమారుగా 79.44 శాతం ఉండొచ్చు. మొత్తం పోలింగ్ పై ఈసీ క్లారిటీ ఇస్తేనే పోలింగ్ పర్సంటేజ్ పై ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈసీ లెక్కల ప్రకారం మొత్తం పోలింగ్ 80.38గా ఉంది. ఇది పోస్టల్ బ్యాలెట్ లు కాకుండా అయితే 79.65గా చూడాల్సి ఉంది. అంటే 2019, 2024కి మధ్య బ్యాలెట్ ఓట్ల వ్యాత్యాసం 1.29 ఉందని మాత్రం చెప్పాల్సి ఉంటుంది.