Home Page SliderTelangana

గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తికి సీపీఆర్ చేసి రక్షించిన పోలీస్

హైదరాబాద్‌లో ఓ ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ గుండెపోటుతో కుప్పకూలని వ్యక్తికి ప్రాణం పోశాడు. రాజేంద్రనగర్ సర్కిల్ వద్ద ఆరాంఘర్ చౌరస్తాలో బస్సు కోసం ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అదే సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాజశేఖర్, ఆ వ్యక్తి వద్దకు వెళ్లి గుండెను గట్టిగా ప్రెస్ చేశాడు. కొంత సేపు సీపీఆర్ చేసి ఆ వ్యక్తి ప్రాణాలు నిలబెట్టాడు. సీపీఆర్ చేయడంతో వ్యక్తి స్పృహ రావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కోలుకున్నాడని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. తక్షణం ప్రాధమిక చికిత్స చేసి వైద్యం చేసిన రాజశేఖర్‌ను ఉన్నతాధికారులు అభినందించారు.