News

ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం అమలును వాయిదా వేసిన ప్రభుత్వం

ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల పై నిషేధం అమలు ఉత్తర్వులను జనవరికి 26 కి వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేదం నవంబర్ 1 తేదీ నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. సాంకేతిక పరిజ్ఞానం, తయారీ సామగ్రిని మార్చుకునేందుకు, తగిన సమయం ఇవ్వాలంటూ ఫ్లెక్సీ తయారీదారుల విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల రద్దు జనవరి 26 నుంచి అమల్లోకి తీసుకురావాలని ఆదేశించారు.సాంకేతిక పరిజ్ఞానం విషయంలో కూడా వారికి సాయం చేయాలని అధికారులకు సీఎం సూచించారు.సామగ్రిని మార్చుకునేందుకు రూ.20 లక్షల వరకు ఫ్లెక్సి తయారీ దారులకు రుణాలు ఇవ్వాలని కూడా అధికారులను సీఎం ఆదేశించారు.