పవన్‌కళ్యాణ్‌కు పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్
తాజాగా పవన్‌కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని తీవ్రంగా ఖండించారు. పవన్‌కళ్యాణ్ పెళ్లిలతో మాకు అవసరం లేదన్నారు. అరే సన్నాసిన్నర సన్నాసి అని పేర్నినాని పవన్‌కళ్యాణ్‌ను సంభోదించారు. పవన్‌కళ్యాణ్‌కు స్రీలను గౌరవించడం తెలియదు కాబట్టే అన్ని పెళ్లిల్లు చేసుకున్నారన్నారు. పవన్‌కల్యాణ్‌కు సంస్కారం లేదు కాబట్టే అందరూ ఈ విషయంలో కామెంట్ చేస్తున్నారని పేర్నినాని తెలిపారు. పవన్‌కళ్యాణ్ చేసే పనులతో వైసీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని పేర్నినాని స్పష్టం చేశారు. పవన్‌కళ్యాణ్ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉండి సిగ్గువిడిచి మాట్లాడారన్నారు. దేశ రాజకీయా చరిత్రలో ఇటువంటి అసభ్య పదజాలాన్ని ఉపయోగించిన వ్యక్తి పవన్‌కళ్యాణేనని పేర్నినాని ఆరోపించారు. జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో పనిచేస్తే ఊడిగం చేస్తున్నామంటావా? మరి నీ పక్కన నాదెండ్ల మనోహర్ ఏమి చేస్తున్నాడని పేర్నినాని ప్రశ్నించారు. రాష్ట్రంలోని కాపులందరూ..వైసీపీకి మద్దతుగా ఉన్నారని దానిని చెడగొట్టే ప్రయత్నం చేయడానికే పవన్‌కళ్యాణ్ చూస్తున్నారని పేర్నినాని మండిపడ్డారు. ఇదంతా రాష్ట్రంలోని కాపులను చంద్రబాబుకు దగ్గర చేసేందుకు చేసే ప్రయత్నంలో భాగమేనని పేర్నినాని అభిప్రాయపడ్డారు.

