గన్నవరం సబ్ జైలుకు పట్టాభి
హింసాత్మక ఘటన తర్వాత టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిని పోలీసులు గన్నవరం సబ్‌జైలుకు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత పోలీసులు పట్టాభిని కస్టడీలో ఉంచుకున్నారు. ఇవాళ పట్టాభిని గన్నవరం అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. వైద్య పరీక్షల తర్వాత పట్టాభిని గన్నవరం సబ్ జైలుకు తరలించాలని జడ్జి ఆదేశించారు. పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని పట్టాభి ఆరోపించడంతో వైద్య పరీక్షలు చేయాలని జడ్జి ఆదేశించారు. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని మరో జైలుకు తరలిస్తామని పోలీసులు చేసిన విజ్ఞప్తిని ఆయన తిరస్కరించారు. ఐతే గన్నవరం సబ్ జైలులో ఎలాంటి సౌకర్యాలు లేనందున మరో జైలుకు తరలించాలని పోలీసులు కోరారు. ఈ విషయమై జడ్జి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.