Home Page SliderNational

“బీజేపీలో ఒక్కరే ప్రధాని అయ్యే కల కంటారు”:రాహుల్

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు. కాగా బీజేపీలో కేవలం ఒక్కరు మాత్రమే ప్రధాని అయ్యే కల కంటారు అన్నారు. అయితే మిగతా వాళ్లు అలా కలలు కనడానికి కూడా భయపడతారని రాహుల్ దుయ్యబట్టారు.అప్పట్లో అభిమన్యుడిని పద్మవ్యూహంలో బంధించి చంపారు.అయితే పద్మవ్యూహం కమలం ఆకారంలో ఉంటుందన్నారు.ఈ కాలంలోను ఒక పద్మవ్యూహం తయారు చేశారన్నారు.అప్పుడు పద్మవ్యూహాన్ని 6గురు కంట్రోల్ చేశారన్నారు.అయితే ఇప్పుడు కూడా ఈ పద్మవ్యూహాన్ని ఆరుగురే కంట్రోల్ చేస్తున్నారన్నారు.మరోవైపు పేపర్ లీక్ అంశం దేశంలోని యువతకు శాపంగా మారిందన్నారు.కాగా ఈ 10 ఏళ్లల్లో అనేకసార్లు పేపర్ లీక్ జరిగిందన్నారు. అయితే పేపర్ లీక్‌పై ఆర్థిక మంత్రి ఒక్కమాట కూడా మాట్లాడలేదని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అగ్నివీర్ పెన్షన్‌కు బడ్జెట్‌లో కేటాయింపులు లేవన్నారు. వీళ్లందరిని కేంద్రం చక్ర వ్యూహంలో బంధించిందని రాహుల్ గాంధీ వెల్లడించారు.