Home Page SliderNationalNews Alert

తాజాగా మరో 200 మంది ఉద్యోగులను తొలగించిన ఓలా

గత కొద్ది రోజుల నుండి పలు దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. తాజాగా ఓలా క్యాబ్‌ సంస్థ కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు తొలగించింది. గత ఏడాది ఓలా 1100 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. తాజాగా మరో 200 మంది ఉద్యోగులను తొలగించింది. వీరిలో టెక్నాలజీ, ప్రొడక్ట్‌ విభాగాల్లోని ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ తొలగింపులు అని ఓలా తెలిపింది. తొలగించిన ఉద్యోగులకు కాంపెన్సేషన్‌ ప్యాకేజీలను అమలు చేస్తామని వెల్లడించింది. మరోవైపు ఇంజనీరింగ్‌, డిజైన్‌ విభాగాల్లో నియామకాలు ఉంటాయని తెలిపింది. సీనియర్‌ ఉద్యోగులను సైతం భర్తీ చేసుకుంటామని పేర్కొంది.