Home Page SliderTelangana

నవంబర్ లో జైలుకి వెళ్లాల్సిందే..

ల్యాండ్ కబ్జా, ఫోన్ ట్యాపింగ్ చేసినోళ్లను ఎవర్నీ వదలమని, ఖచ్చితంగా వారు జైలుకు పోవాల్సిందేనని మంత్రి సీతక్క అన్నారు. దీపావళికి ముందే బాంబులు పేలుతాయన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ చాలా మంది జీవితాలను చిన్నాభిన్నం చేసిందన్నారు. రాష్ట్రాలను దోచుకున్న వాళ్లను విడిచి పెట్టే ప్రసక్తే లేదన్నారు. నవంబర్ లో కీలక నేతలు తప్పకుండా లోపలికి వెళ్తారని సీతక్క తెలిపారు.