Andhra PradeshHome Page Slider

ఈసీ ఆదేశాలతో ఏపీలో IAS అధికారులపై బదిలీ వేటు

Share with

ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు ఐఏయస్ అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్ కొరడా ఝుళిపించింది. జిల్లా ఎన్నికల అధికారులపై బదిలీ వేటువేసింది. కృష్ణా జిల్లా -పి రాజాబాబు, అనంతపురం -ఎం గౌతమి, తిరుపతి -లక్ష్మీషాపై ఈసీ బదిలీ వేటు వేసింది. వారితోపాటుగా… ఏపీలోని ఐదుగురు ఐపీయస్ అధికారులపై కొరడా ఝుళిపించింది కేంద్ర ఎన్నికల కమిషన్. చిత్తూరు ఎస్పీ జాషువా, ప్రకాశం ఎస్పీ పరమేశ్వరరెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, అనంతపురం ఎస్పీ అంబురాజన్ పై వేటు పడింది. వీరిని వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది.గుంటూరు రేంజ్ IG పాలరాజు బదిలీ అయ్యారు. బదిలీ అయిన అధికారులు ఎన్నికలు పూర్తయ్యే వరకూ విధుల్లో ఉండకూడదని ఆదేశించింది. ఎన్నికలతో సంబంధం లేని పోస్టుల్లోకి బదిలీ చేయాలని రాష్ట్ర సీఇఓ కు ఆదేశాలిచ్చింది. ఎన్నికల కమీషన్ ఆదేశాలను ఛీఫ్ సెక్రటరీ, డీజీపికి సీఇఓ పంపించారు. ఆయా జిల్లాల ఎస్పీల పోస్టులకు ప్యానల్ పంపాలని ఆదేశించింది. రాష్ట్ర సీఇఓ ఇచ్చిన నివేదిక, ప్రతిపక్షాల ఫిర్యాదు మేరకు ఎస్పీలపై బదిలీ వేటు జరిగింది. మొత్తంగా ఎన్నికల ముందు జగన్‍కు భారీ షాక్ తగిలింది. ఈసీ ఆదేశాలతో ఏపీలో ఐదుగురు IPS, IG లపై వేటు పడింది. సాయంత్రం 5 గంటల్లోపు బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారి భర్తీకి ముగ్గురు ఆఫీసర్లతో ప్యానల్ పంపాలని ఆదేశించింది.