తెలుగుసినిమాలో నటించమని వార్నర్‌ను కోరిన నెట్‌ఫ్లిక్స్
క్రికెట్ ప్రేమికులలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పేరు వినని వారుండరు. క్రికెట్ మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉంటాడు వార్నర్. తెలుగు హిట్ సినిమాలలోని పాటలకు కుటుంబంతో సహా హుషారుగా డాన్స్ చేసి, ట్విట్టర్‌లో పోస్టులు చేస్తుంటాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా ఐపీఎల్ కప్‌ను సాధించాడు. అందుకేనేమో తెలుగు సినిమాలపై మక్కువ చూపిస్తుంటాడు.

వార్నర్‌కు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ సూపర్ సలహా ఇచ్చింది. క్రికెట్ నుండి రిటైర్ అయ్యాక తెలుగు సినిమాలలో నటించమని కోరింది. తెలుగు సినిమా వార్నర్‌కు సరైన వేదిక అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై వార్నర్ సరదాగా స్మైలీ ఎమోజీలను జత చేస్తూ ట్వీట్‌కు బదులిచ్చాడు. పుష్ప సినిమాలో అల్లుఅర్జున్ గెటప్‌లో వార్నర్ అభిమానులను అలరించాడు. పుష్ప సినిమా ఎంత హిట్ అయ్యిందో, వార్నర్ డాన్స్ కూడా అంతే హిట్ అయ్యింది. డిజే టిల్లు, రష్మిక గెటప్‌లలో కూడా ఆకట్టుకున్నాడు వార్నర్.

