ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబునాయుడు
ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాలకు ఒక దిక్సూచి. దేశంలోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని సీఈవో.. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే అంతలా శ్రమించారు. బ్రాండ్ హైదరాబాద్ సార్థకత చేకూర్చారు. నారా చంద్రబాబు నాయుడు CBN అని కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు 1995 నుంచి 2004 వరకు, విభజన తర్వాత 2014 నుంచి 2019 వరకు, ఇప్పుడు 2024 నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2004 నుంచి 2014 వరకు, 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. 2015 నుండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, చంద్రబాబుతో సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకాగా, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో సహా, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పక్షాల నేతలు హాజరయ్యారు.


