Home Page SliderTelangana

త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనా రెడ్డి ప్రమాణస్వీకారం

బీజేపీ సీనియర్ నేత, తెలంగాణ ముఖ్యనేతగా ఉన్న నల్లు ఇంద్రసేనా రెడ్డి త్రిపుర గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేశారు. త్రిపుర 20వ గ‌వ‌ర్నర్‌గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ ఇంద్రసేనారెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. కీలక రాష్ట్రానికి గవర్నర్ గా నియమించినందుకు రాష్ట్రపతికి ఇంద్రసేనారెడ్డి రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు.

తన శక్తి మేరకు త్రిపుర అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఇంద్రసేనా రెడ్డి చెప్పారు. పాలనలో పారదర్శకత, సాధికారత, జవాబుదారీతనం వచ్చేలా తాను బాధ్యతలు నిర్వహిస్తానన్నారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఇక ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలంగాణ, ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు, ఇంద్రసేనా రెడ్డి మద్దతుదారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరా సంస్థ ఎండీ షేక్ మస్తాన్ పాల్గొన్నారు.