Home Page SliderNational

ట్రీట్‌మెంట్ ఆలస్యమైతే నా చేతిని తీసేయాల్సి వచ్చేది: మోసిన్ ఖాన్

ఈ IPL సీజన్ త్వరలోనే చివరి దశకు చేరుకోబోతుంది. ఈ నేపథ్యంలో IPL ట్రోఫీని దక్కించుకునేందుకు జట్టులన్ని హోరాహోరీగా తలపడుతున్నాయి. కాగా నిన్న జరిగిన LSG Vs MI మ్యాచ్‌లో ఎవరు ఊహించని విధంగా LSG గెలుపొందింది. అయితే ఈ గెలుపుకి ప్రధాన కారణం LSG ప్లేయర్ మోసిన్ ఖాన్ అనే చెప్పాలి. ఎందుకంటే నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆయన అద్భుతంగా బౌలింగ్ చేశారు. కాగా మ్యాచ్ అనంతరం మోసిన్ ఖాన్  మీడియాతో మాట్లాడారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..తనకు గతంలో అయిన గాయం గురించి ప్రస్తావించారు. నా భుజం దగ్గర రక్తం గడ్డ కట్టింది. అప్పుడు నేను నా చేతిని కూడా సరిగ్గా ఎత్తలేకపోయేవాడిని అని అన్నారు. ఆ సమయంలో ట్రీట్‌మెంట్ ఒక్క నెల ఆలస్యమైనా నా చేతిని తీసేయాల్సిన పరిస్థితి వచ్చేదని డాక్టర్లు చెప్పారన్నారు. ఆ గాయం వల్ల నేను పడిన బాధ మరొకరికి రావొద్దని కోరుకుంటానని మోసిన్ ఖాన్ వెల్లడించారు.