ఎల్బీనగర్ లో మర్డర్..
హైదరాబాద్ ఎల్బీనగర్ పీఎస్ పరిధిలోని శివ గంగా కాలనీలో దారుణం జరిగింది. కారుతో గుద్ది.. వేట కొడవళ్లతో ఓ వ్యక్తిపై దాడి చేసి హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. భరత్ నగర్‌కు చెందిన బొడ్డు మహేష్ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఇటీవల చైతన్యపురిలోని ఓ క్లినిక్‌లో ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడి చేసిన కేసులో మహేష్ బెయిల్ పై బయటికి వచ్చాడు. పాత కక్షలు నేపథ్యంలో హత్య జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నారు.

