NewsTelangana

బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనంపై ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్ట్‌ అయి ఇటీవలే బెయిల్‌పై బయటికొచ్చారు. తనకు పోలీసులు కేటాయించిన బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కారుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల నుంచి తనకు ముప్పు ఉండడంతో బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కారును రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ అధికారులు కేటాయించారు. అయితే.. తనకు కేటాయించిన బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు నిత్యం రిపేర్లకు గురి అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 4 నెలల క్రితం నడిరోడ్డులోనే బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కారు ఆగిపోతే… దానిని ఇంటెలిజెన్స్‌ కార్యాలయానికి పంపిచానని అన్నారు. మంచి కండిషన్‌లో ఉన్న కారు పంపించడానికి బదులుగా పోలీసులు నిలిచిపోయిన వాహనానికి రిపేర్లు చేసి పంపారన్నారు. 2 నెలల క్రితం నాంపల్లి కోర్టుకు వెళుతుండగా దారి మధ్యలో ఆగిపోగా.. గన్‌మెన్ల సాయంతో ఆటోలో కోర్టు వెళ్లానన్నారు. ఇటీవలే అఫ్జల్‌ గంజ్‌లోనూ ఆ వాహనం ఆగిపోగా.. ఇంటి నుంచి సొంత వాహనాన్ని రప్పించుకోవాల్సి వచ్చిందని రాజాసింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.