NewsTelangana

భాగ్యనగరంలో మరో ఫ్లైఓవర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ నగరానికి మరింత వన్నె తెచ్చేందుకు రంగం సిద్ధమైందన్నారు ఐటీ మంత్రి కేటీఆర్..  శిల్పా లేఅవుట్ మొదటి దశ ఫ్లైఓవర్‌ను.. తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించారు. ఐటీ కారిడార్‌ను ఓఆర్‌ఆర్‌తో కలుపుతూ రూ. 250 కోట్లతో ప్రభుత్వం ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించింది. ఐకియా మాల్ వెనుక నుండి నిర్మించిన ఈ వంతెన ORR చేరుకుంటుంది. ఇనార్బిట్ మాల్, రహేజా మైండ్ స్పేస్ స్క్వేర్, బయో డైవర్సిటీ స్క్వేర్ మధ్య నిర్మిస్తున్న హైదరాబాద్ నాలెడ్జ్ సెంటర్‌ను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన మూడో ప్రాజెక్ట్ ఇది.

ఈ ఫ్లై ఓవర్ మొత్తం పొడవు 956 మీటర్లు. 16 మీటర్లు. హైదరాబాద్‌లోనే అతి పొడవైన ఫ్లై ఓవర్‌ ఇదే. SRDP కింద 17వ ప్రాజెక్ట్ పూర్తయింది. ఫ్లైఓవర్‌ ప్రారంభంతో గచ్చిబౌలి జంక్షన్‌లో ట్రాఫిక్‌ సమస్యలు తీరనున్నాయి. ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీల మధ్య రోడ్డు కనెక్టివిటీ మరింత పెరుగుతుంది. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్‌ గద్వాల విజయలక్ష్మితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.