Breaking Newshome page sliderHome Page SliderNewsTelangana

వాతావరణశాఖ హెచ్చరిక… మూడు రోజులు వర్షాలే…

తెలంగాణలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు నమోదవగా, వాతావరణ శాఖ బుధవారానికి ఆరెంజ్‌ అలర్ట్, ఇతర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. అలాగే నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, సిద్దిపేట, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గత 24 గంటల్లో తాండూరులో 11.18 సెం.మీ., దౌల్తాబాద్‌లో 10.68 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో వందలాది ఎకరాల పంటలు నీటమునిగి నష్టపోయాయి. పరిగి పట్టణంలోని పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు ప్రవేశించి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ తహసీల్దార్ కార్యాలయంలోకి వర్షపు నీరు చేరి ప్రభుత్వ రికార్డులు తడిసి మరమ్మతులకీ గురయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తలోడిలో పిడుగుపాటు ఘటన చోటుచేసుకొని వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రాజెక్టులకు భారీ వరద ఇన్‌ఫ్లోశ్రీశైలం ప్రాజెక్టుకు 90,560 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండటంతో ఒక గేటు ద్వారా 27,000 క్యూసెక్కులు, విద్యుత్ కేంద్రాల ద్వారా 67,000 క్యూసెక్కుల వరకు నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటి మట్టం ప్రస్తుతం 883.70 అడుగులకు చేరుకుంది. జూరాలకు 1.02 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజీకి 98,440 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, 85 గేట్లు ఎత్తి అదే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వర్షాలు కొనసాగే సూచన వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పంట భూముల రక్షణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులూ సూచిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్‌ మోడ్‌లో ఉండి సహాయక చర్యలు చేపడుతున్నాయి.