News

చిన్నారి మృతదేహంతో పాటే బస్సులో ప్రయాణం

భోపాల్, మనసర్కార్

ఓ వ్యక్తి చిన్నారి మృతదేహన్ని భుజం మీద మోసుకెళ్లిన ఫోటో ఒకటి అందరిని కంటతడి పెట్టిస్తుంది. నాలుగేళ్ల చిన్నారి తన స్వగ్రామంలో ప్రమాదవశాత్తూ మృతి చెందింది. దాంతో పోస్టమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఛాతర్‌పుర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం తిరిగి వచ్చే సమయంలో చిన్నారి బంధువులు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. మృతదేహన్ని తరలించేందుకు ఆసుపత్రి వద్ద ఎటువంటి వాహనం లేకపోవడం , అదే సమయంలో ప్రైవేటు వాహనంలో ఊరు వెళ్లేందుకు సరిపడా డబ్బు లేకపోవడంతో చేసేది ఏమిలేక బస్టాండ్ వరకు చిన్నారి మృతదేహన్ని భుజంపై వేసుకొని వెళ్లాడు. దీనిని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. అందరిలానే తన ఊరు వెళ్లే బస్సు ఎక్కాడు. టికెట్ కొనేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో తోటి ప్రయాణికుడు సహాయం చేశాడు. కొద్ది నెలల క్రితం అదే ఆసుపత్రికి వెళ్లిన ఓ కుటుంబానికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఛాతర్‌పుర్ ప్రాంతంలో అత్యవసర సదుపాయాల అందబాటుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.