జమ్ములో పెద్ద ఎత్తున లిథియం నిల్వలు, దేశీయంగానే బ్యాటరీల తయారీ
జమ్మూ కాశ్మీర్‌లో దేశంలో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు కనుగొనబడినట్లు భారత గనుల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తొలిసారిగా జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో 5.9 మిలియన్ టన్నుల లిథియం ఇన్‌ఫెర్డ్ రిసోర్స్‌లను (జి3) గుర్తించింది” అని గనుల మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. లిథియం, గోల్డ్‌తో సహా 51 మినరల్ బ్లాక్‌లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేశామని తెలిపింది. లిథియం నాన్-ఫెర్రస్ మెటల్ మరియు EV బ్యాటరీలలో కీలకమైన భాగాలలో ఒకటి. “ఈ 51 మినరల్ బ్లాక్‌లలో 5 బ్లాక్‌లు బంగారానికి సంబంధించినవని, ఇతర బ్లాక్‌ల్లో… పొటాష్, మాలిబ్డినం, బేస్ మెటల్స్ మొదలైన వస్తువులకు సంబంధించిన నిల్వలు జమ్మూ కాశ్మీర్ (యుటి), ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, జార్ఖండ్, కర్నాటకమధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ,” లోని 11 రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయని గనుల శాఖ పేర్కొంది. 2018-19 ఫీల్డ్ సీజన్‌ల నుండి ఇప్పటి వరకు GSI చే నిర్వహించబడిన రీసెర్చ్ ఆధారంగా బ్లాక్‌లను నిర్ధారించారు.
BloombergNEF ప్రకారం, EV యుగంలో మొదటిసారిగా లిథియం-అయాన్ బ్యాటరీ ఖర్చులు గత సంవత్సరం పెరిగాయి. లిథియం రేట్లు భారీగా పెరగడంపై ఎలోన్ మస్క్ విచారం వ్యక్తం చేశాడు. ఎలక్ట్రానిక్ కార్లను తక్కువ ధరకు విక్రయించడానికి ముడిసరుకులకు అధిక మొత్తాన్ని వెచ్చించాల్సి వస్తోందన్నాడు. 2070 నాటికి దేశమంతటా ఈవీలను వినియోగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిజ్ఞ చేస్తున్నందున, EVల తయారీని వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కనీసం $3.4 బిలియన్లు… 28 వేల కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను ఆవిష్కరించింది. ఎలక్ట్రిక్ కార్లలో అత్యంత ఖరీదైనవి బ్యాటరీలు. స్థానికంగా తయారు చేయడం వల్ల… ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. దేశీయంగా బ్యాటరీలు తయారు చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఎగుమతులు చేసి, విదేశీమారకద్రవ్యాన్ని సైతం పొందొచ్చు. ఈ విషయంలో ముఖేష్ అంబానీ వంటి బిలియనీర్ల ఆసక్తి చూపిస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ క్లీన్ ఎనర్జీకి $76 బిలియన్లు 6 లక్షల 27 వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా EV బ్యాటరీ తయారీ కోసం కేటాయించాలని భావిస్తోంది. స్కూటర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్‌తో సహా మూడు కంపెనీలలో అంబానీ కూడా ఉన్నారు.

బులియన్ రిఫైనర్ రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ అధునాతన బ్యాటరీ సెల్ డెవలప్‌మెంట్‌కు మద్దతుగా $2.3 బిలియన్ ప్రోగ్రామ్ కింద ప్రోత్సాహకాలను అందుకోనుంది. ప్రపంచంలో రెండో అత్యధిక జనాభా కలిగిన దేశం లిథియం-అయాన్ బ్యాటరీల కోసం దేశీయ డిమాండ్‌ను తీర్చడానికి అవసరమైన ముడి పదార్థాలలో కొంత భాగాన్ని మాత్రమే కలిగి ఉంది. 2030 నాటికి లథియం బ్యాటరీ అవసరాలు 100 రెట్లు పెరుగొచ్చని క్రిసిల్ అంచనా వేసింది. ప్రపంచం గ్యాసోలిన్-ఇంధన దహన యంత్రాల నుండి దూరమవుతున్నందున, లిథియం-అయాన్ బ్యాటరీలలోకి వెళ్ళే లిథియం, నికెల్, కోబాల్ట్, ఇతర లోహాలకు డిమాండ్ పెరుగుతోంది. బ్యాటరీ తయారీ రంగంలోకి ప్రవేశించేందుకు అడ్డంకులు చాలా ఎక్కువగా ఉన్నాయని మణికరణ్ పవర్ లిమిటెడ్ డైరెక్టర్ జస్మీత్ సింగ్ కల్సి వార్తా సంస్థ బ్లూమ్‌బెర్గ్‌కి తెలిపారు. కంపెనీ భారతదేశపు మొట్టమొదటి లిథియం రిఫైనరీని ఏర్పాటు చేస్తోంది. విదేశాలలో నికెల్, కోబాల్ట్, రాగి నిల్వలను సమకూర్చుకుంటోంది. ఈ విషయంలో చైనా ఇప్పటికే ఎంతో అడ్వాన్స్డ్‌గా ఉంది. లిథియం బ్యాటరీ తయారీలో భారత్ ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది. ఇప్పటికే ప్రపంచ మార్కెట్‌పై చైనా ఆధిపత్యం కొనసాగుతోంది. మార్కెట్‌పై చైనా పట్టును విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో దేశీయంగా బ్యాటరీ ఉత్పత్తిని పెంచడానికి అమెరికా ప్రయత్నిస్తోంది.

