NationalNews

పంజాబ్ నేతలకు బీజేపీ కీలక పదవులు

గాంధీలకు వ్యతిరేకంగా ఘాటైన వ్యాఖ్యలతో కాంగ్రెస్ నుండి బయటకు వెళ్లిన మూడు నెలల తర్వాత, జైవీర్ షెర్గిల్‌ను బీజేపీ… అధికార ప్రతినిధిగా నియమించింది. పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, పంజాబ్‌ కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌ సునీల్‌ జాఖర్‌లతోపాటుగా యూపీ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమితులయ్యారు. ఉత్తరాఖండ్ బీజేపీ మాజీ చీఫ్ మదన్ కౌశిక్, విష్ణు దేవ్ సాయి, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్‌ల మాజీ అధ్యక్షులు, పంజాబ్‌కు చెందిన రాణా గుర్మిత్ సింగ్ సోధి, మనోరంజన్ కాలియా, అమన్‌జోత్ కౌర్ రామూవాలియాలు బీజేపీ జాతీయ కార్యవర్గానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శించిన జైవీర్ షెర్గిల్‌ను పార్టీ అధికార ప్రతినిధిగా నియమించింది. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదని… కాంగ్రెస్‌ను చెదపురుగులు లాగా తింటున్నారంటూ ఆయన ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబ సభ్యులు ఏడాదిగా తనతో సమావేశాన్ని తిరస్కరించారని.. అందుకే పార్టీ అన్ని సంబంధాలను తెంచుకున్నానంటూ బోల్డ్ కామెంట్స్ చేశారు జైవీర్ షర్గిల్.