NewsTelangana

మోదీ పర్యటనను అడ్డుకునేందుకు కేసీఆర్‌ కుట్రలు

సీఎం కేసీఆర్‌ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని మరోసారి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కేసీఆర్‌పై తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్‌ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌, కేటీఆర్‌ ప్రధానిపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మోడీ ఈడి బోడి ఏం పీకలేడు అని మాట్లాడుతుంటే సభ్య సమాజం అసహ్యించుకుంటున్నారని అన్నారు. ప్రధాని రాష్ట్రానికి వస్తే.. ఢిల్లీ పారిపోతున్న వ్యక్తి కేసీఆర్‌ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌ ఫోన్‌ టాపింగ్‌ చేస్తున్నారని గవర్నరే చెప్పుకునే పరిస్థితి వచ్చిదంటే.. ఇంతకంటే దుర్మార్గం ఏముంటదని ఫైర్‌ అయ్యారు. ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని ఈ రోజు ఏ సంఘాలు అయితే ప్రకటనలు చేస్తున్నారో.. 8 సంవత్సరాలుగా ఈ సంఘాలకు ఒక్కరోజు అయినా సీఎం అపాయింట్‌ ఇచ్చారా? అని ఈటల ప్రశ్నించారు. ఏం చేశారని కేసీఆర్‌ గొప్పవాడు అయ్యాడు చెప్పండని నిలదీశారు. అబద్దాల పునాదుల మీద రాష్ట్రాన్ని నడిపే వ్యక్తి కేసీఆర్‌ అని ఈటల మండిపడ్డారు.