కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.. తర్వాతే ఆంధ్రాలో ఎంట్రీ
ఆంధ్రులను తరిమికొడతానన్న కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు అని బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా ప్రజలు కేసీఆర్‌ను ఎందుకు సమర్థించాలని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలే బీఆర్‌ఎస్‌ను ఛీ కొడుతున్నారన్నారు. కోవిడ్ సమయంలో ఏపీ ప్రజలు వైద్యం కోసం వస్తే బోర్డర్‌లో అడ్డుకున్నావ్ అని నిలదీశారు. ఆంధ్రాకు రావాల్సిన నీటిని సముద్రం పాలు చేస్తున్నావని, ఏపీకి రావాల్సిన నిధులను ఇంతవరకు రాకుండా చేశావని జీవీఎల్ నరసింహారావు తీవ్రంగా మండిపడ్డారు.

