జగన్ పేరు మోళీ మోహన్ -లోకేష్
జగన్ రెడ్డికి తాను ముద్దుపేరు పెట్టానంటున్నారు యువగళం పాదయాత్రలో పర్యటిస్తున్న నారా లోకేష్. జగన్‌ను నమ్మలేమని, సింహం సింగిల్‌గా వస్తుందని, తనను ఎవరూ పీకలేరని జగన్ అంటూంటారని, కానీ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రజలు బాగా గుండుకొట్టి పంపించారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రజల బాధ్యతను తమ పార్టీ తీసుకుంటుందని, జగన్ పని అయిపోయిందని, జైలు రాబిడ్డా రా అంటూ పిలుస్తోందన్నారు. తెలుగుదేశం నాయకులపై దాడులు చేస్తూ వచ్చారని, వాటికి తగిన సమాధానం చెపుతానని, తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్‌ను వణికించే బాద్యతను తాను తీసుకుంటానని,. ఎన్టీఆర్ దేవుడని, చంద్రబాబు రాముడని, తాను తాను వైసీపీ వారికి మూర్ఖుడినని అన్నారు.

ఎన్నికల ముందు ఇచ్చే హామీలన్నీ బుట్టదాఖలు చేశారన్నారు. మోళీ మోహన్ పథకాలు ఇచ్చినట్లే ఇచ్చి, మరో చేతితో ధరల ఆకాశానికి పెంచేస్తూ, బిల్లుల మీద మాత్రం ఆయన ఫొటో పెట్టుకోరన్నారు. విద్యార్థులకు ఇచ్చే మెస్ చార్జ్ మాత్రం తక్కువన్నారు. యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని, జాబ్ క్యాలెండర్ ఇస్తామని, మోసం చేశారన్నారు. ఎన్నికల ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తానని, ప్రభుత్వమే నకిలీ మద్యంతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతోందనన్నారు. రాయలసీమ రైతులకు ఉరితాడు లాంటి మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారని, వారి కాగితాలపై సంతకాలు పెట్టొద్దన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను కూడా సీపీఎస్ రద్దు చేస్తానని, చేయలేదన్నారు. తాము అధికారంలోకి రాగానే అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

